యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్న అఖిల్ ఫ్లాప్ మూవీ 'మిస్టర్ మజ్ను'!

Akhil Movie Mr Majnu Hit in You tube
  • ఇటీవల హిందీలోకి డబ్ అయిన చిత్రం
  • 10 కోట్లకు పైగా వ్యూస్ తో సూపర్ హిట్
  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను'
ఇటీవలికాలంలో టాలీవుడ్ లో కలెక్షన్లను రాబట్టడంలో విఫలమైన పలు చిత్రాలు, హిందీలోకి డబ్ అయి, లక్షల కొద్దీ వ్యూస్ ను సాధిస్తున్న సంగతి తెలిసిందే. అదే కోవలోకి అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' కూడా చేరిపోయింది. తెలుగులో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు యూ ట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఈ సినిమాకు కోట్లల్లో వ్యూస్ వచ్చాయి.

ఇటీవల హిందీ వర్షన్ లో సినిమాను యూ ట్యూబ్ లో విడుదల చేశారు. అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. అప్ ‌లోడ్ చేసిన 40 గంటల వ్యవధిలోనే ఈ సినిమా 20 మిలియన్ల వ్యూస్ సాధించడం గమనార్హం. ఆపై నెలరోజుల వ్యవధిలోనే 100 మిలియన్లు (10 కోట్ల) వ్యూస్ సాధించిందని, 13 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాగా, గతంలో 'సవ్యసాచి', 'ఛల్ మోహన రంగా', 'డీజే' తదితర చిత్రాల హిందీ వర్షన్లు యూ ట్యూబ్ లో ఇదే తరహాలో 100 మిలియన్ వ్యూస్ సాధించాయి.
Go Back to Shorts
Mr Majnu
You Tube
Hit
100 Million Views

More Telugu News