Ebrahim Alkazi: గుండెపోటుతో కన్నుమూసిన థియేటర్ లెజెండ్ ఇబ్రహీం అల్కాజీ

  • ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం
  • నేడు అంత్యక్రియలు
Ebrahim Alkazi passes away

నాటక రంగానికి విశేష సేవలు అందించిన థియేటర్ లెజెండ్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) మాజీ డైరెక్టర్, పద్మవిభూషణ్‌ గ్రహీత ఇబ్రహీం అల్కాజీ నిన్న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు పైజల్ ధ్రువీకరించారు. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిన తన తండ్రిని సోమవారం ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

ఇబ్రహీం మృతికి  రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ఫాదర్‌ ఆఫ్‌ మోడర్న్‌ ఇండియన్‌ థియేటర్‌’గా ఖ్యాతికెక్కిన ఇబ్రహీం.. 1962 నుంచి 1977 వరకు ఎన్ఎస్‌డీ డైరెక్టర్‌గా పనిచేశారు. నసీరుద్దీన్‌ షా, ఓంపురి వంటి బాలీవుడ్‌ ప్రముఖులు ఆయన వద్దే పాఠాలు నేర్చుకున్నారు. నాటక రంగానికి ఇబ్రహీం అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1966లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్‌, 2010లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

More Telugu News