Srikakulam District: దళిత యువకుడిని బూటుకాలితో తన్నిన కాశీబుగ్గ సీఐపై సస్పెన్షన్ వేటు

  • దళిత యువకుడిని తల్లిముందే బూటుకాలితో తన్నిన సీఐ
  •  సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విమర్శల వెల్లువ  
  • ప్రాథమిక విచారణ అనంతరం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
Srikakulam dist Kasibugga CI Suspended

దళిత యువకుడిని బూటు కాలితో తన్ని, చితకబాదిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దళిత యువకుడైన జగన్‌ను సీఐ బూటుకాలితో తన్నిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ఏపీ డీజీపీ కార్యాలయం ఈ ఘటనపై విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణ అనంతరం విశాఖపట్టణం డీఐజీ కాళిదాస్ రంగారావు సీఐ వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

బాధితుడు పలాస మండలంలోని టెక్కలిపట్నంకు చెందిన వ్యక్తి. ఇళ్ల పట్టా విషయంలో గ్రామానికి చెందిన జగన్, రమేశ్ అనే యువకుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరూ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితుడు జగన్‌పై సీఐ రెచ్చిపోయాడు. తల్లిముందే అతడిపై దాడిచేసి బూటుకాలితో తన్నాడు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

More Telugu News