వైసీపీ నేతలు అప్పట్లో ఏమన్నారో తెలుపుతూ.. ఆ వీడియో పోస్టు చేసిన బుద్ధా వెంకన్న
- అమరావతే రాజధాని అన్నట్టుగా మాట్లాడిన నేతలు
- ప్రజల్ని మోసం చేశారంటూ జగన్ పై బుద్ధా ధ్వజం
- దమ్ముంటే రాజీనామా చేయాలంటూ సవాల్
రోజా తదితర వైసీపీ నేతలు గతంలో రాజధాని అమరావతి గురించి ఏమన్నారో ఆ వీడియోలో చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడమే జగన్ వైఖరికి నిదర్శనమని, జగన్ ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాడని చాలామంది హర్షిస్తున్నారని ఆ నేతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు విజయవాడ, గుంటూరుకు మధ్యలో ఇల్లు కట్టుకున్నాడని రోజా తెలిపారు. వైసీపీ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటైందని మరో నేత పేర్కొన్నారు.
ఈ వీడియో పోస్టు చేసిన బుద్ధా వెంకన్న దమ్ముంటే రాజీనామా చేయాలంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. "అమరావతే రాజధాని అని ప్రజల్ని మోసం చేశావు, మూడు రాజధానుల అజెండాతో ప్రజాభిప్రాయానికి సిద్ధమా?" అని ప్రశ్నించారు.