Dharmendra Pradhan: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కరోనా పాజిటివ్

Union minister Dharmendra Pradhan tested corona positive
  • ప్రధాన్ కు కరోనా లక్షణాలు
  • గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరిక
  • ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంమంత్రి అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ లో కరోనా సోకిన మంత్రుల సంఖ్య రెండుకు చేరింది. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే డాక్టర్ల సూచనతో గురుగ్రామ్ లోని మేదాంత ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

ఇటీవలే కరోనా బారినపడిన హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, తనకు కరోనా సోకడం పట్ల ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్టులో పాజిటివ్ అని వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.
Dharmendra Pradhan
Corona Virus
Positive
Union Minister
Amit Shah

More Telugu News