కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కరోనా పాజిటివ్
- ప్రధాన్ కు కరోనా లక్షణాలు
- గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరిక
- ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంమంత్రి అమిత్ షా
ఇటీవలే కరోనా బారినపడిన హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, తనకు కరోనా సోకడం పట్ల ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్టులో పాజిటివ్ అని వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.