Yuvraj Singh: ఆ విషయాన్ని ధోనీ నాకు క్లియర్ గా చెప్పాడు: యువరాజ్ సింగ్ 

Kohli not supported me when I lost place in the team says Yuvraj
  • 2019 ప్రపంచకప్ కు సెలెక్టర్లు నన్ను పరిగణనలోకి తీసుకోరని ధోనీ ముందే చెప్పాడు
  • జట్టులోకి పునరాగమనం చేసినప్పుడు కోహ్లీ మద్దతిచ్చాడు
  • స్థానం కోల్పోయిన తర్వాత అండగా నిలవలేదు
2019 ప్రపంచకప్ కోసం సెలెక్టర్లు తనను పరిగణనలోకి తీసుకోరని ధోనీ ఎప్పుడో చెప్పాడని మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చెప్పాడు. తన క్రికెట్ భవిష్యత్తుపై ధోనీ చాలా ముందుగానే స్పష్టతనిచ్చాడని తెలిపాడు. తాను టీమిండియాలోకి పునరాగమనం చేసినప్పుడు కోహ్లీ మద్దతిచ్చాడని.. అయితే... తాను జట్టులో స్థానాన్ని కోల్పోయిన తర్వాత విరాట్ తనకు అండగా నిలవలేదని చెప్పాడు. 2003, 2007, 2011 ప్రపంచ కప్ లలో యువీ ఆడాడు. 2015, 2019 ప్రపంచకప్ లలో స్థానం దక్కలేదు. 2011 ప్రపంచ కప్ తర్వాత క్యాన్సర్ తో పోరాడి యువరాజ్ విజయం సాధించాడు. గత ఏడాదే క్రికెట్ కు యూవీ వీడ్కోలు పలికాడు.
Yuvraj Singh
MS Dhoni
Virat Kohli
Team India

More Telugu News