India: మరో రెండు చైనా యాప్ లపై భారత్ నిషేధం

India bans two more China Apps
  • జూన్ 29న 59 యాప్ లను నిషేధించిన భారత్
  • తాజాగా వీబో, బైడు సెర్చ్ లపై నిషేధం
  • మరిన్ని చైనా యాప్ లపై నిషేధం విధించే యోచనలో ఇండియా
గాల్వాన్ ఘటన జరిగిన తర్వాత చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ దేశానికి చెందిన 59 యాప్ లను జూన్ 29న నిషేధించింది. భారత రక్షణ, సమగ్రత, భద్రతకు ఆటంకం కలిగిస్తున్నాయనే కారణంతో వీటిపై నిషేధం విధించింది. భారత్ నిషేధం విధించిన తర్వాత చైనా యాప్ లపై ఇతర దేశాలు కూడా కొరడా  ఝుళిపించడం మొదలు పెట్టాయి. తాజాగా మరో రెండు చైనా యాప్ లపై భారత్ నిషేధం విధించింది.

ట్విట్టర్, గూగుల్ కు ప్రత్యామ్నాయాలుగా ఉన్న వీబో, బైడు సెర్చ్ లను ఇండియా నిషేధించింది. ఇంటర్నెట్ ప్రొవైడర్ల నుంచి ఈ రెండు యాప్ లను తీసేయాలని ఆదేశించింది. మరోవైపు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా వీటిని తొలగించారు. మరిన్ని చైనా యాప్ లను నిషేధించే యోచనలో కూడా భారత్ ఉన్నట్టు తెలుస్తోంది.
India
China
App

More Telugu News