Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ భూమి పూజ ముహూర్త నిర్ణేత విజయేంద్రశర్మకు బెదిరింపులు

Threats to Ayodhya Ramalaya land worshiper Vijayendra Sharma
  • రేపు జరగనున్న అయోధ్య రామాలయ భూమిపూజ 
  • వేరొక ముహూర్తం ప్రకటించాలంటూ ఆగంతకుల ఒత్తిడి
  • విజయేంద్రశర్మ ఇంటివద్ద పోలీసుల భద్రత  
రేపు జరగనున్న అయోధ్య రామాలయ భూమి పూజకు ప్రముఖ సిద్ధాంతి ఎన్.ఆర్.విజయేంద్రశర్మ ముహూర్తాన్ని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈయన కర్ణాటకలోని బెళగావికి చెందినవారు. అయితే తాను నిర్ణయించిన భూమిపూజ ముహూర్తం సరైంది కాదంటూ, వేరొకటి ప్రకటించాలని ఆగంతుకులు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నట్టు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయన ఇంటివద్ద భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విజయేంద్రశర్మ మాట్లాడుతూ తాను రెండు ముహూర్తాలను సూచించగా రామజన్మభూమి ట్రస్ట్ ఈ ముహుర్తాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు.
Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust
Vijayendra Sharma

More Telugu News