Jagan: వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది: జగన్

 jagan extends his deepest condolences on the death of vangapandu
  • ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు
  • జానపదాన్ని తన బాణీగా మార్చుకున్నారు
  • ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు
  • వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం
ప్రముఖ ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు. ఆయన సేవలను గుర్తు తెచ్చుకున్నారు.

'వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పాముని పొడిచిన  చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను' అని జగన్ ట్వీట్ చేశారు.
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News