సుశాంత్ ప్రమాదంలో ఉన్నాడని ఫిబ్రవరిలోనే ముంబయి పోలీసులను అప్రమత్తం చేశా: కేకే సింగ్
- వీడియో రిలీజ్ చేసిన సుశాంత్ తండ్రి
- తన ఫిర్యాదును ముంబయి పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ
- సుశాంత్ చనిపోయిన తర్వాత కూడా చర్యలు లేవని ఆవేదన
- అందుకే బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడి
ఫిబ్రవరి 25న బాంద్రా పోలీసులకు సుశాంత్ కు ముప్పు ఉందన్న సంగతి చెప్పానని, కొందరు వ్యక్తుల పేర్లు చెప్పి వారిపై చర్యలు తీసుకోవాలని కోరానని వివరించారు. కానీ వారు స్పందించలేదని, కనీసం సుశాంత్ మరణించిన తర్వాత కూడా వారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని కేకే సింగ్ ఆరోపించారు. అందుకే తాను బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు.