Shakir Manzoor: కశ్మీర్లో భారత జవానును అపహరించిన ఉగ్రవాదులు!

Indian solider missing during his leave in Jammu Kashmir
  • బక్రీద్ కోసం సెలవుపై ఇంటికి వెళ్లిన షకీర్
  • కారులో షోషియాన్ పయనం
  • సగం కాలిన స్థితిలో కనిపించిన కారు
  • ఆచూకీ లేకుండాపోయిన షకీర్
పాకిస్థాన్ తో సరిహద్దుల వెంబడి విధులు నిర్వర్తించే భారత సైనికులు ఉగ్రవాదులకు ఎప్పుడూ టార్గెట్ గానే ఉంటారు. ముఖ్యంగా ఆ జవాన్లు సెలవుపై జమ్మూ కశ్మీర్ లోని తమ స్వస్థలాలకు వెళ్లినప్పుడు వారిపై దాడులు చేయడం వంటి ఘటనలు గతంలో జరిగాయి. తాజాగా అలాంటిదే ఓ ఘటన జరిగింది. జమ్మూ కశ్మీర్ కు చెందిన షకీర్ మంజూర్ భారత సైన్యంలో జవానుగా పనిచేస్తున్నాడు. 162వ బెటాలియన్ కు చెందిన షకీర్ బక్రీద్ పండుగ నేపథ్యంలో సెలవుపై స్వగ్రామానికి వెళ్లాడు.

అయితే, ఆదివారం సాయంత్రం కుల్గాం జిల్లా బోర్డర్ వద్ద అతని కారు సగం కాలిపోయి కనిపించింది. షోపియాన్ వెళ్లేందుకు తన నివాసం నుంచి బయల్దేరిన షకీర్ ఆచూకీ లేకుండా పోయాడు. పైగా కారు దగ్ధమైన స్థితిలో కనిపించడంతో అతడిపై ఉగ్రవాదులు దాడి చేసి కిడ్నాప్ చేసి ఉంటారని, అతడి కారును తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత సైన్యం షకీర్ జాడ కోసం తీవ్రంగా గాలిస్తోంది.
Shakir Manzoor
Soldier
Jammu And Kashmir
Terrorists
Pakistan

More Telugu News