Sunkara Padmasri: జగన్ నేరుగా పొడిస్తే.. బీజేపీ వెన్నుపోటు పొడుస్తోంది: కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ

Jagan and Modi are deceiving AP says Sunkara Padmasri
  • ఏపీకి మోదీ, జగన్ తీరని ద్రోహం చేశారు
  • స్వార్థ రాజకీయాల కోసం రాజధానిని ముక్కలు చేశారు
  • మహిళల కన్నీరు వీరికి కనిపించడం లేదా?
ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ తీరని ద్రోహం చేశారని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం రాజధానిని ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని వ్యతిరేకిస్తున్నట్టు జగన్ గతంలో ఎన్నడూ చెప్పలేదని అన్నారు. మహిళా జేఏసీ ఆధ్వర్యంలో నేడు 'రాఖీ ప్రొటెస్ట్' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సుంకర పద్మశ్రీ పైవ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచాలని కోరుతూ మోదీ, జగన్ ఫొటోలకు రాఖీలు కట్టామని చెప్పారు.  

రాజధాని కోసం 33 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పలేదా? అని ప్రశ్నించారు. అమరావతి రైతులను జగన్ నేరుగా పొడిస్తే... బీజేపీ వెన్నుపోటు పొడుస్తోందని చెప్పారు. అమరావతిని రాజధానిగా ఉంచాలని పోరాడుతున్న మహిళల కన్నీరు వీరికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రైతులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం సంతోషకరమని చెప్పారు.
Sunkara Padmasri
Congress
Jagan
Narendra Modi
Amaravati

More Telugu News