Microsoft: టిక్ టాక్ పై అధికారిక ప్రకటన చేసిన మైక్రోసాఫ్ట్

  • టిక్ టాక్ ను కొనుగోలు చేస్తున్నాం
  • సెప్టెంబర్ 15 కల్లా చర్చలను పూర్తి  చేస్తాం
  • సమాచార భద్రతకు ముప్పు రాకుండా చర్యలు తీసుకుంటాం
Microsoft announces take over of TikTok

సస్పెన్స్ కు తెరపడింది. ప్రముఖ వీడియో మెసేజింగ్ యాప్ టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్టు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఓ మైక్రో బ్లాగ్ పోస్ట్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొనుగోలుకు సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేస్తామని తెలిపింది. టిక్ టాక్ ను కొనుగోలు చేసే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారనే వార్తల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సవివరంగా ప్రకటనను విడుదల చేసింది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరాలను అర్థం చేసుకున్నామని... సమాచార భద్రతకు ముప్పు రాకుండా టిక్ టాక్ కార్యకలాపాలను స్వాధీనం చేసుకుంటామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అమెరికాకు ఆర్థిక లాభం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అమెరికా పౌరుల డేటాను ఎట్టి పరిస్థితుల్లో ఇతర దేశాలతో పంచుకోబోమని స్పష్టం చేసింది. అమెరికా సమాచారం పొరపాటున ఇతర దేశాల్లోని సర్వర్లలోకి వెళ్లి ఉంటే... వాటిని శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది.

More Telugu News