Raja Singh: ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చేశాం.. నెక్ట్స్ టార్గెట్ ఇవే: రాజాసింగ్

Raja Singh reveals BJPs next target
  • అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నాం
  • తదుపరి లక్ష్యం మధుర, వారణాసి దేవాలయాలు
  • అయోధ్య భూమి పూజకు మోదీ హాజరు కావడంలో తప్పు లేదు
గతంలో ఏమేం చెప్పామో వాటన్నింటినీ చేశామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. అయోధ్యలో అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మిస్తామని చెప్పామని... ఆ మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ లను రద్దు చేశామని చెప్పారు. తమ తదుపరి లక్ష్యం మధుర, వారణాసి దేవాలయాలేనని అన్నారు.

ఆ రెండు దేవాలయాల గురించి కూడా న్యాయపోరాటం చేసి గెలుస్తామని చెప్పారు. ఆ దేవాలయాల నిర్మాణం కూడా బీజేపీ హయాంలో జరుగుతుందని తెలిపారు. ఆ రెండు దేవాలయాల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని...  కోర్టులో విజయం సాధిస్తామని చెప్పారు. అయోధ్య భూమి పూజకు ప్రధాని మోదీ హాజరు కావడంలో తప్పు లేదని అన్నారు. భారతదేశం హిందూ దేశంగా అవతరించాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని అభిప్రాయపడ్డారు.
Raja Singh
BJP
Narendra Modi
Ayodhya Ram Mandir

More Telugu News