IPL 2020: ఐపీఎల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం... యూఏఈ వేదికగా లీగ్

  • కరోనా వ్యాప్తితో భారత్ నుంచి యూఏఈ తరలివెళ్లిన ఐపీఎల్
  • కేంద్రం అనుమతి కోసం వేచిచూస్తున్న యూఏఈ
  • కేంద్రం క్లియరెన్స్ ఇవ్వడంతో తొలగిన అడ్డంకులు
Indian government gives nod for IPL to be held at UAE

అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ నిర్వహణకు కేంద్రం ఆమోదం తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి లీగ్ పోటీలను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐ యూఏఈ ప్రభుత్వాన్ని కోరింది.

అయితే, భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చేవరకు తాము లీగ్ ఏర్పాటుపై అంగీకారం తెలుపలేమని యూఏఈ తెలిపింది. ఇప్పుడు భారత ప్రభుత్వం యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహణకు ఓకే చెప్పడంతో అతి పెద్ద క్రికెట్ సంబరానికి అడ్డు లేకుండా పోయింది. ఈ టోర్నీ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈలోని పలు స్టేడియాల్లో జరగనుంది. కాగా, కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఒక్కో ఫ్రాంచైజీ 24 మంది ఆటగాళ్లను యూఏఈ తరలించేందుకు అనుమతి ఇచ్చారు.

More Telugu News