Ram Gopal Varma: పవన్ కల్యాణ్ కు ఫ్రెండ్షిప్ డే శుభకాంక్షలు తెలిపిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma wishes Pawan Kalyan on World Friendship Day
  • రీసెంట్ గా పవర్ స్టార్ చిత్రం రూపొందించిన వర్మ
  • ట్విట్టర్ లో పవన్ కు స్నేహ హస్తం చాచిన వైనం
  • పవన్ స్పందన ఎలావుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి
ఇటీవలే పవర్ స్టార్ అనే చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తీవ్ర కలకలం రేపాడు. ట్విట్టర్ వేదికగా జనసేనాని పవన్ కల్యాణ్ కు వర్మ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపాడు. "పవన్ కల్యాణ్, మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు... అయితే సరైన వ్యక్తులతోనే!" అంటూ వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి, వర్మ చాచిన స్నేహ హస్తానికి పవన్ కల్యాణ్ స్పందిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Ram Gopal Varma
Pawan Kalyan
Friendship Day
Wishes
Powerstar

More Telugu News