Bandi Sanjay: తెలంగాణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన బండి సంజయ్

Bandi Sanjay announced Telangana BJP General body
  • సీనియర్లు, కొత్తవారి కలయికలో కార్యవర్గం
  • 8 మంది ఉపాధ్యక్షుల నియామకం
  • పూర్తి కార్యవర్గం ఏర్పాటు
తెలంగాణ బీజేపీకి కొత్త రూపు వచ్చింది. కొన్నాళ్ల కిందట రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ తాజాగా పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించారు. జి.విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బండారు శోభారాణి, సంకినేని వెంకటేశ్వరరావు తదితరులను ఉపాధ్యక్షులుగా నియమించారు.

ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి ప్రధానకార్యదర్శులుగా నియమితుయ్యారు. రఘునందన్ రావు, కుంజా సత్యవతి, పల్లె గంగారెడ్డి తదితరులు కార్యదర్శులుగా కొత్త కార్యవర్గంలో కొలువుదీరారు. బండారి శాంతి కుమార్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నూతన కార్యవర్గంలో సీనియర్ నేతలతో పాటు కొత్తవారికి కూడా అవకాశం కల్పించారు.
Bandi Sanjay
Telangana
BJP
General Body

More Telugu News