Uttar Pradesh: కరోనా సోకి ఉత్తరప్రదేశ్ మంత్రి కమలారాణి మృతి

UP Minister Kamala Rani passes away due to Coronavirus
  • కరోనా కట్టడి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న కమలారాణి
  • కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన మంత్రి
  • లక్నోలోని ఆసుపత్రిలో పొందుతూ మృతి
కరోనా వైరస్‌ సోకి ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి కమలారాణి మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్‌ బారినపడిన ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. అయితే, లక్నోలోని సంజ‌య్ గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆమె మృతి చెందారని వైద్యులు ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనే వారు. ఆ సమయంలోనే ఆమెకు కరోనా సోకింది. కాగా, గతంలో ఆమె లోక్‌సభ సభ్యురాలిగానూ పనిచేశారు. ఆమెకు ఓ కుమార్తె ఉంది.  కమలారాణి  మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.

Uttar Pradesh
Corona Virus
COVID-19

More Telugu News