Chhattisgarh: కర్ర సాయంతో గర్భిణిని మోసుకెళ్లిన బంధువులు.. వీడియో ఇదిగో

A pregnant woman from Kadnai village of Surguja was carried on a
  • ఛత్తీస్‌గఢ్‌లో ఘటన
  • గ్రామంలో రోడ్డు సదుపాయాలు లేని వైనం
  • కాన్పు కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన బంధువులు
ఆ గ్రామంలో రహదారి సదుపాయాలు లేవు.. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు రావడానికి కూడా వీలుగా అక్కడి రోడ్లు లేవు. దీంతో ఓ కర్రకు తాళ్లతో బుట్టను కట్టి అందులో గర్భిణిని కూర్చోబెట్టి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు బంధువులు.

ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలోని కడ్నాయి గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు లభ్యమైంది. ఆమెను నలుగురు బంధువులు మోసుకుంటూ తీసుకెళ్లారు. వర్షాలకు తమ గ్రామంలో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ఆమెను వాటిని దాటిస్తూ వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మొదట ఓ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లి అక్కడి నుంచి కాన్పు కోసం మరో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

Chhattisgarh
Viral Videos

More Telugu News