Jr NTR: ఎన్టీఆర్ సినిమా కోసం బాలీవుడ్ భామ?

Bollywood beauty contacted for NTR movie
  • 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ 
  • ఇప్పటికే స్క్రిప్టు సిద్ధం చేసిన దర్శకుడు
  • కియరా అద్వానీతో సంప్రదింపులు
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకులుగా రాణిస్తున్న అతికొద్ది మంది దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ప్రేక్షకులలోనే కాకుండా ... ట్రేడ్ వర్గాలలో కూడా ఆయనకుండే క్రేజే వేరు. అందుకే, ఆయన సినిమాలో నటించడానికి మన హీరోలు ఉబలాటపడుతుంటారు. మళ్లీ మళ్లీ ఆయనతో సినిమా చేయాలని కోరుకుంటూవుంటారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్ కూడా అలాగే తన తదుపరి చిత్రాన్ని ఆయనతో ప్లాన్ చేసుకున్నాడు.

ఈ చిత్రానికి ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందనీ, ఈ లాక్ డౌన్ కాలంలో వీరిద్దరూ ఈ చిత్రంపై బాగా చర్చలు జరిపారనీ వార్తలొచ్చాయి. అసలు కరోనా మహమ్మారి లేకపోతే కనుక ఈపాటికే ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యేది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి.

ఈ క్రమంలో ఇందులో నటించే కథానాయిక పాత్ర విషయమై ఇప్పటికే కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ భామ, గతంలో తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాలలో నటించిన కియరా అద్వానీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం కియరాతో ఈ చిత్రం బృందం సంప్రదింపులు జరుపుతోందట.
Jr NTR
Kiara Advani
Trivikram Srinivas
Rajamouli

More Telugu News