BJP: మాణిక్యాలరావు మృతితో తీవ్ర విషాదంలో ఏపీ బీజేపీ వర్గాలు

AP BJP deeply sadened to the demise of senior leader Pydikondala Manikyalarao
  • తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్న సోము వీర్రాజు
  • దశాబ్దాల పాటు బీజేపీకి విశేష సేవలందించారని కితాబు
  • మాణిక్యాలరావు మృతి తీవ్రంగా కలచివేసిందన్న కన్నా
ఏపీ బీజేపీ సీనియర్ నేత, మాజీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనా బారినపడి కన్నుమూయడం తెలిసిందే. ఆయన మృతితో రాష్ట్ర బీజేపీ వర్గాల్లో తీవ్ర విచారం నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ, మాణిక్యాలరావు అకాల మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు. దశాబ్దాల పాటు బీజేపీకి విశేష సేవలు చేశారని, మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానంటూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు.

మాణిక్యాలరావు మృతి పట్ల ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విచారం వ్యక్తం చేశారు. కరోనాను జయించి ఆసుపత్రి నుంచి తిరిగి వస్తారని భావించామని తెలిపారు. మిత్రుడు మాణిక్యాలరావు మృతి తనను తీవ్రంగా కలచివేసిందని కన్నా వివరించారు.
BJP
Andhra Pradesh
Pydikondala Manikyala Rao
Death
Corona Virus

More Telugu News