Chiranjeevi: ఓ సామాన్యుడిలా వచ్చి రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు: మాణిక్యాలరావు మృతిపై చిరంజీవి స్పందన

Chiranjeevi condolences former minister Manikyalarao demise
  • కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత
  • విషాదానికి లోనయ్యానన్న చిరంజీవి
  • మాణిక్యాలరావు ఎంతో మంచి మనిషి అంటూ వ్యాఖ్యలు
బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి స్పందించారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాతో మృతి చెందారన్న వార్తతో విషాదానికి లోనయ్యానని అన్నారు. మాణిక్యాలరావు ఎంతో మంచి మనిషి అని, ఓ సామాన్యుడిలా రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులు చేపట్టే స్థాయికి ఎదిగారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.
Chiranjeevi
Manikyala Rao
Demise
Corona Virus
BJP
Andhra Pradesh

More Telugu News