Sushant Singh Rajput: మోదీ సార్.. మీరు సత్యాన్ని నమ్ముతారని నా మనసు చెపుతోంది: సుశాంత్ సింగ్ సోదరి

  • కేసు విచారణ సక్రమంగా జరిగేలా చూడండి
  • సాక్ష్యాలు నాశనం కాకుండా చూడండి
  • మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం
Sushant Singhs sister seeks Modis intervention

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించిన విచారణలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి అతని సోదరి శ్వేత సింగ్ కీర్తి విన్నవించారు. కేసును మీరు పరిశీలించాలని కోరుతున్నానని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

'డియర్ సార్... మీరు సత్యానికి కట్టుబడి ఉంటారని నా మనసు చెపుతోంది. మేము ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాం. బాలీవుడ్ లో అడుగుపెట్టే సమయంలో నా సోదరుడికి ఏ గాడ్ ఫాదర్ లేరు. ఇప్పుడు కూడా మాకు ఎవరూ లేరు. మీరు వెంటనే ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. విచారణ నిష్పక్షపాతంగా కొనసాగేలా చూడాలని విన్నవిస్తున్నాం. సాక్ష్యాలు నాశనం కాకుండా చూడాలని ప్రాధేయపడుతున్నాం. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం' అని మోదీకి శ్వేత విన్నవించారు.

34 ఏళ్ల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న ముంబై సబర్బన్ బాంద్రాలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలను ముంబై పోలీసులు ఇంత వరకు ఛేదించలేకపోయారు. ఈ నేపథ్యంలో, ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా కేసును సీబీఐకి అప్పగించాలని సూచించారు.

More Telugu News