Tornado: యాదాద్రి భువనగిరి జిల్లాలో టోర్నడో... వీడియో ఇదిగో!

Tornado appears in Yadadri Bhuvanagiri district
  • మూసీ నదిపై టోర్నడో విజృంభణ
  • భూమ్మీద నుంచి ఆకాశానికి ఎగిసిన నీళ్లు
  • వీడియో వైరల్
అమెరికాలో ఎక్కువగా సంభవించే టోర్నడోలు ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనూ కనిపిస్తున్నాయి. ఇటీవలే యానాంలో రొయ్యలచెరువులపై ఏర్పడిన టోర్నడో బీభత్సం సృష్టించింది. తాజాగా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది సమీపంలో ఏర్పడింది. భూమ్మీద నుంచి ఆకాశంలోని మేఘాల వరకు సుడులు తిరుగుతూ నీళ్లు పైకెగిశాయి. భారీ స్థాయిలో ఏర్పడిన ఈ టోర్నడో పరిసర గ్రామాల ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ అయింది.
Tornado
Yadadri Bhuvanagiri District
Moosi River
Telangana
Viral Videos

More Telugu News