టీకా అభివృద్ధిలో మరో విజయం సాధించిన ఆక్స్ ఫర్డ్
- 'సీహెచ్‌ఏడీవోఎక్స్1 ఎన్‌కొవ్-19' ప్రయోగాత్మక టీకా అభివృద్ధి
- కోతుల్లో ప్రయోగం.. పనితీరు సంతృప్తికరం
- ఆశాజనక ఫలితాలు ఇచ్చిందన్న పరిశోధకులు
ఈ టీకాను ఆరు కోతులకు ఇచ్చి 28 రోజుల తర్వాత అవి కరోనా బారిన పడేలా చేశారు. వైరస్ కారణంగా వచ్చే న్యూమోనియాను ఈ టీకా నిలువరించగలిగినట్లు తేల్చారు. కరోనాను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక వ్యవస్థ నుంచి బలమైన ప్రతిస్పందనను ఉత్పత్తి చేసుకోగలిగిందని చెప్పారు. కోతుల్లో వైరల్ లోడును తగ్గించడంతో పాటు ఊపిరితిత్తులు దెబ్బతినకుండా రక్షించడంలో తాము అభివృద్ధి చేసిన టీకా ఉపయోగపడుతుందని ఆక్స్‌ఫర్డ్ తెలిపింది.
అయినప్పటికీ కరోనా సోకకముందే దాన్ని పూర్తిగా నివారించడం మాత్రం దానికి సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కరోనా వైరస్ తన స్పైక్ ప్రొటీన్ ద్వారా మనిషి కణాల్లోకి చొరబడుతుంది. జలుబు వంటి వాటిల్లోనూ అడినో వైరస్‌లోనూ ఇలాంటి ప్రొటీన్ ఉంటుంది. అడినోవైరస్‌ను బలహీనపర్చడం ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేశారు.