Prakasam District: ప్రకాశం జిల్లాలో దారుణం.. శానిటైజర్ తాగి 8 మంది మృతి

8 people died in Prakasam dist as they drink sanitizer
  • వేర్వేరు ఘటనల్లో మొత్తం 8 మంది మృతి
  • నాటుసారాలో కలుపుకుని కొందరు..
  • మద్యానికి బదులుగా తాగి మరికొందరు మృత్యువాత
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. శానిటైజర్ తాగి ఏకంగా 8 మంది మృత్యువాత పడడం కలకలం రేపుతోంది. కురిచేడు అమ్మవారి ఆలయం వద్ద బిక్షమెత్తుకునే ఇద్దరు యాచకులు మద్యానికి బానిసయ్యారు. అయితే, మద్యం ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయంగా గత కొన్ని రోజులుగా శానిటైజర్ తాగుతున్నారు. వీరిలో ఒకరు నిన్న రాత్రి తీవ్రమైన కడుపు నొప్పితో చనిపోగా, మరో వ్యక్తి కూడా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే అతడిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

మరో ఘటనలో కురిచేడు పోలీస్ స్టేషన్ సమీపంలో నివసించే రమణయ్య నిన్న ఉదయం నాటుసారాలో శానిటైజర్ కలిపి తాగి ఇంటికెళ్లి కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని దర్శి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, శానిటైజర్ తాగి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఐదుగురు నేడు మరణించినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Prakasam District
Darsi govt hospital
sanitizer
liquor
dead

More Telugu News