Congress: వాగులో కొట్టుకుపోతోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాపాడిన యువకులు.. వీడియో ఇదిగో

  • ఉత్తరాఖండ్‌లో ఘటన
  • త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న హరీశ్ ధామి
  • వాగును దాటుతుండగా ప్రమాదం  
ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ధామి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పితోరగఢ్‌లోని ధార్చులా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఓ వాగును ఎమ్మెల్యే హరీశ్ దాటుతుండగా ఒక్కసారిగా జారి పడిపోయారు.

వాగులో కొట్టుకుపోకుండా ఆయనను పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు కాపాడారు. ఆయనను పార్టీ కార్యకర్తలు రక్షిస్తుండగా తీసిన వీడియో మీడియాకు దొరికింది. వాగులో ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరగడంతో ఎమ్మెల్యే హరీశ్ పడిపోయారని అక్కడి వారు చెప్పారు. ఆ నీరంతా చెత్తతో నిండి ఉందని చెప్పారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే హరీశ్‌కు స్వల్పగాయాలయ్యాయని వివరించారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలను పరామర్శించడానికి ఆయన అక్కడికి వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Congress
Uttarakhand
Viral Videos

More Telugu News