Narendra Modi: ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాక్ మహిళ.. రెండున్నర దశాబ్దాలుగా పంపుతున్న వైనం!

PM Narendra Modis Pakistani sister Qamar Mohsin Shaikh sends him rakhi
  • మోదీకి రాఖీ పంపిన పాక్ సోదరి కమర్ మొహిసిన్
  • మోదీ ఆహ్వానిస్తే ఢిల్లీకి వెళ్తానన్న సోదరి
  • ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థన
గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా మోదీకి రాఖీ పంపుతున్న పాక్ సోదరి కమర్ మొహిసిన్ షేక్ ఈసారి కూడా రాఖీ పంపారు. మోదీని తనతోపాటు తన భర్త, కుమారుడు కూడా అభిమానిస్తారని ఈ సందర్భంగా కమర్ పేర్కొన్నారు. మోదీ ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని ప్రార్థిస్తూ ఈ రాఖీ పంపినట్టు తెలిపారు.

ట్రిపుల్ తలాక్‌పై మోదీ తీసుకున్న చర్యను కమర్ ప్రశంసించారు. మోదీ తప్ప మరెవరూ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదని అన్నారు. వచ్చే ఐదేళ్లు మోదీకి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. మోదీ నుంచి పిలుపు వస్తే తాను తప్పకుండా ఢిల్లీ వెళ్తానని చెప్పుకొచ్చారు. మోదీ చాలా సాధారణంగా కనిపించినా పనులు మాత్రం గొప్పగా చేస్తారని కితాబునిచ్చారు. తన ఇద్దరు చెల్లెళ్లు కూడా మోదీకి రాఖీ కట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
Narendra Modi
Pakistani sister
Qamar Mohsin Shaikh
rakhi

More Telugu News