Vidyabalan: 'నావరకు నేను ఎక్కువే తీసుకుంటా'నంటున్న విద్యాబాలన్!

  • గత పన్నెండేళ్లుగా మహిళా ప్రధాన చిత్రాలే!
  • తనకంటూ మార్కెట్ ఉందంటున్న విద్యాబాలన్
  • 'శకుంతలాదేవి' రేపు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల     
Vidyabalan about her remuneration

పెళ్లయిన తర్వాత కూడా కథానాయికగా కొనసాగుతున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ కు ఓ ప్రత్యేకత ఉంది. గత పన్నెండేళ్లుగా కేవలం మహిళా ప్రధాన (విమెన్ ఓరియెంటెడ్) చిత్రాలనే చేస్తూవస్తోంది. వాటిని కూడా ఏదిపడితే అది ఒప్పుకోదు. అభినయానికి ఆస్కారం వుండాలి.. తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోవాలి.. అలాంటి కథలనే ఎంచుకుంటుంది. అందుకే, ఆమెకంటూ ఓ మార్కెట్ కూడా వుంది.

ఇక పారితోషికం పరంగా కూడా తాను ఎక్కువే తీసుకుంటానని చెబుతోంది విద్యాబాలన్. "మిగతా వాళ్ల విషయమేమో కానీ, నావరకు నేను బాగానే తీసుకుంటాను. గత 12 ఏళ్ల నుంచీ కేవలం మహిళా ప్రధాన చిత్రాలే చేస్తున్నాను. దాంతో నాకంటూ ఇక్కడ ఓ మార్కెట్ కూడా ఏర్పడింది. దాంతో నా సినిమాలకు మార్కెట్ ఇబ్బంది వుండదు. మార్కెట్టును బట్టే పారితోషికం కూడా ఇస్తారు. నా సినిమాలలో నేనే ప్రధాన పాత్ర పోషిస్తాను కాబట్టి అందరి కంటే ఎక్కువ పారితోషికం తీసుకునేది కూడా నేనే" అని చెప్పింది విద్యాబాలన్.

'డర్టీ పిక్చర్' చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డుతో పాటు ఆరుసార్లు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా అందుకున్న విద్య, 2014లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందింది. ఇక తాజాగా ఆమె హ్యూమన్ కంప్యూటర్ గా పేరు తెచ్చుకున్న గణిత మేధావి 'శకుంతలాదేవి' బయోపిక్ లో టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా రేపు డైరెక్ట్ రిలీజ్ అవుతోంది.    

More Telugu News