Undavalli Sridevi: పేకాట వార్తలపై.. కంటతడి పెట్టిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి!

YSRCP MLA Sridevi responds on gambling news on her
  • పేకాటతో నాకు సంబంధం లేదు
  • పేకాటరాయుళ్లను విడిచిపెట్టమని పోలీసులకు ఫోన్ చేయలేదు
  • తప్పుడు వార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తా
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కంటితడి పెట్టారు. నంబూరు గ్రామంలో జరిగిన పేకాటతో శ్రీదేవికి సంబంధం ఉందని... ఈ గాంబ్లింగ్ చేయిస్తున్నది ఆమేనని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ పేకాటతో తనకు సంబంధం లేదని చెప్పారు. నంబూరు గ్రామం తన నియోజకవర్గంలోకి రాదని తెలిపారు. ఈ కథనాలు తనను ఎంతో బాధిస్తున్నాయని కన్నీరు పెట్టారు. పేకాట అంశంపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు.

మహిళ అని కూడా చూడకుండా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీదేవి మండిపడ్డారు. పేకాట ఆడిస్తున్నానంటూ తప్పుడు కథనాలను రాస్తున్నారని అన్నారు. పేకాట ఆడుతూ దొరికిన వారిని విడిచిపెట్టాలని తాను పోలీసులకు ఫోన్ చేసి చెప్పాననే వార్తల్లో నిజం లేదని చెప్పారు. తన గురించి ఏ ఛానల్ అయినా తప్పుడు వార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఏదైనా రాసే ముందు నిజాలు తెలుసుకోవాలని చెప్పారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను కాబట్టే వాస్తవాలను వివరించడానికి మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని... డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
Undavalli Sridevi
YSRCP
Gambling

More Telugu News