Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన కృష్ణా బోర్డు

Krishna board asks to send report to Apex Council on Rayalaseema Lift Project
  • రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముందుకెళ్లొద్దు
  • కేంద్ర జల సంఘం అపెక్స్ కౌన్సిల్ కు నివేదిక పంపండి
  • అక్కడి నుంచి ఆనుమతులు వచ్చాకే నిర్మాణాన్ని ప్రారంభించండి
రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి ముందుకెళ్లొద్దని తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులను చేపట్టాలంటే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు పూర్తి నివేదికను సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది.

కేంద్ర జల సంఘం అపెక్స్ కౌన్సిల్ కు నివేదికను పంపాలని... అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని తెలిపింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు కృష్ణా బోర్డు కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంపై నీళ్లు చల్లినట్టైంది.
Andhra Pradesh
Rayalaseema Lift Project
Krishna Board

More Telugu News