Rajamouli: ఏమీ కాదు సార్: రాజమౌళికి ధైర్యం చెప్పిన బండ్ల గణేశ్

Bandla Ganesh gives suggestion to Rajamouli
  • రాజమౌళికి కరోనా పాజిటివ్
  • ప్రతి రోజు గుడ్లు తినాలని చెప్పిన బండ్ల గణేశ్
  • హాయిగా నిద్రపోవాలని సూచన
తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటిన దర్శక దిగ్గజం రాజమౌళికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందనే వార్తలతో టాలీవుడ్ ఉలిక్కి పడింది. ఆయన త్వరగా కోలుకోవాలనే సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ నటుడు, బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

 'హ్యాపీగా ఉండండి సర్. ఏమీ కాదు. ప్రతి రోజు కోడి గుడ్లు తినండి. విశ్రాంతి తీసుకోండి. హాయిగా నిద్రపోండి' అని సూచించారు. బండ్ల గణేశ్ కూడా కరోనా బారిన పడి, కోలుకున్న సంగతి తెలిసిందే. తన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాజమౌళికి గణేశ్ సూచనలు చేశారు.
Rajamouli
Bandla Ganesh
Tollywood

More Telugu News