Kerala: ఫ్లోరిడాలో కేరళ నర్సు దారుణ హత్య.. ఆసుపత్రి బయట దారుణంగా పొడిచి చంపిన భర్త

Malayali nurse stabbed to death by husband in US
  • కొట్టాయంకు చెందిన మెరీన్ జాన్
  • భర్తతో గొడవలే కారణం
  • ఫిలిప్ మాథ్యూ అరెస్ట్
కేరళలోని కొట్టాయంకు చెందిన ఓ నర్సు అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణ హత్యకు గురైంది. భర్తతో కలిసి నివసిస్తున్న మెరీన్ జాయ్ (26) కోరల్ స్ప్రింగ్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. నిన్న ఉదయం విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఆమెపై అప్పటికే పార్కింగ్ స్థలంలో ఉన్న భర్త ఫిలిప్ మాథ్యూ కత్తితో దాడిచేసి విచక్షణ రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కాగా, భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఫిలిప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kerala
Nurse
america
kottayam
Crime News

More Telugu News