నాయీబ్రాహ్మణులను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ.. రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు

28-07-2020 Tue 21:34
  • ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు
  • రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేసిన నాయీబ్రాహ్మణ నేతలు
  • వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్
Case filed on Ram Gopal Varma at Rajolu PS

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వివాదాలు కొత్త కాదు! ఆయన సినిమాలకు సంబంధించి ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. తాజాగా నాయీబ్రాహ్మణులను కించపరిచాడంటూ ఆయనపై తూర్పుగోదావరి జిల్లా రాజోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో వర్మ నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారని నాయీబ్రాహ్మణ సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ వర్మ వరుసగా సినిమాలు తీస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుండడం తెలిసిందే.