Alla Nani: చంద్రబాబుది పైశాచిక ఆనందం: మంత్రి ఆళ్ల నాని

Alla Nani criticises TDP chief Chandrababu
  • జగన్ నిర్ణయాల పట్ల బాబు ఓర్వలేకపోతున్నారన్న నాని
  • డాక్టర్ల స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం
  • ప్రభుత్వాసుపత్రులను భ్రష్టుపట్టించారని విమర్శలు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో ముందుండి యుద్ధం చేస్తున్న డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుది పైశాచిక ఆనందం అని విమర్శించారు.

ప్రజారోగ్యం విషయంలో సీఎం జగన్ నిర్ణయాల పట్ల ఓర్వలేకే చంద్రబాబు డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బందిపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా విషయంలో అత్యధిక టెస్టులతో మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోందని ఆళ్ల నాని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఒక్క వైద్య పోస్టును భర్తీ చేయలేదని, ఆరోగ్య శ్రీ, 108, 104 వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన చరిత్ర బాబుదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా భ్రష్టుపట్టించారని ఆరోపించారు.
Alla Nani
Chandrababu
Jagan
Corona Virus
Andhra Pradesh

More Telugu News