KTR: మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్ ఉదయం 5.30 కల్లా ఫీల్డ్ లో ఉండాలి: కేటీఆర్ 

  • ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీలపై కేటీఆర్ సమీక్ష
  • రోడ్లు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి వాటిపై ఫోకస్ పెట్టాలని సూచన
  • కొత్త మున్సిపల్ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి
Municipal Charmens and Commissioners has to be in field by early morning orders KTR

మున్సిపాలిటీల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ యాక్షన్ ప్లాన్ ఆధారంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు అందరూ పని చేయాలని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలపై ఈరోజు కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్లు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. కొత్త మున్సిపల్ చట్టం నిర్దేశించిన పనులను కచ్చితంగా  చేపట్టాలని చెప్పారు.

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, మాస్కులు, బూట్లను అందించాల్సిన బాధ్యత మున్సిపాలిటీలే తీసుకోవాలని కేటీఆర్ చెప్పారు. కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్ ఉండాలని... వాటిలో సగం షీటాయిలెట్లు ఉండాలని తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్ ఉదయం 5.30 గంటలకే ఫీల్డ్ లో ఉండాలని చెప్పారు. సర్ ప్రైజ్ విజిట్స్ కూడా చేయాలని సూచించారు.

More Telugu News