Nara Lokesh: 'కరోనా ఆసుపత్రుల్లో అద్భుత వసతులు' అంటూ వైసీపీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి: లోకేశ్

Nara Lokesh slams YCP leaders in the wake of corona
  • ఏపీ ఆసుపత్రుల్లో వసతులు దారుణం అంటూ లోకేశ్ ట్వీట్
  • భోజనం కోసం రోగులు అలమటిస్తున్నారని ఆవేదన
  • జగన్ అనుచరులు రోగుల భోజనాన్ని కూడా వదలడంలేదని విమర్శ
ఏపీలో కరోనా ఆసుపత్రుల్లో వసతులు దారుణంగా ఉన్నాయంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. కరోనా ఆసుపత్రుల్లో వసతులు అద్భుతం అంటూ అధికార పార్టీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ వాస్తవ పరిస్థితుల్లో కరోనా రోగులకు భోజనం కూడా అందడంలేదని తెలిపారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో భోజనం పెట్టండి మహాప్రభో అంటూ రోగులు ఆందోళన చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. లోకేశ్ దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో రోగుల బాధలు చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అనుచరులు టెస్టింగ్ కిట్లు, బ్లీచింగ్ కొనుగోళ్ల పేరుతో కోట్లు మింగారని, ఇప్పుడు రోగులకు ఇచ్చే భోజనాన్ని కూడా వదలడంలేదని మండిపడ్డారు.

Nara Lokesh
Corona Virus
YSRCP
Leaders
Jagan
Andhra Pradesh

More Telugu News