Farmer: సోనూ సూద్ నుంచి ట్రాక్టర్ అందుకున్న రైతు పేదవాడు కాదంటూ ప్రచారం... ఆవేదన వ్యక్తం చేసిన రైతు

Farmer who was gifted a tractor from Sonu Sood disappoints with bad campaign
  • తండ్రికి సాయంగా పొలం దున్నిన కుమార్తెలు
  • ట్రాక్టర్ పంపిన సోనూ సూద్
  • రైతులను చదివిస్తానన్న చంద్రబాబు
  • తమకు ఏ పార్టీతో సంబంధం లేదన్న రైతు
చిత్తూరు జిల్లా రైతు నాగేశ్వరరావు కుమార్తెలు కాడెద్దులుగా మారి పొలం దున్నడం చూడలేక బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కొత్త ట్రాక్టర్ పంపించిన సంగతి తెలిసిందే. ఆపై, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ రైతు ఇద్దరు కుమార్తెలను టీడీపీ చదివిస్తుందని ప్రకటన చేశారు.

ఈ నేపథ్యంలో, అసలా రైతు నిజంగా పేదవాడు కాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీనిపై రైతు నాగేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెలను చంద్రబాబు చదివిస్తాననడంతోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ స్వస్థలమైన మహల్రాజపురం గ్రామానికి వచ్చి తమ పరిస్థితి ఏంటో పరిశీలించుకోవచ్చని ఆయన సూచించారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, తన పేదరికం పట్ల జాలిపడి ముంబయిలో ఉన్న సోనూ సూద్ మహానుభావుడు ట్రాక్టర్ కానుకగా పంపితే, ఈ విధంగా విషప్రచారం చేయడం దారుణమని అన్నారు.
Farmer
Tractor
Sonu Sood
Chandrababu
Chittoor District

More Telugu News