సురేందర్ రెడ్డితో అల్లు అర్జున్ ప్రాజక్ట్?

27-07-2020 Mon 16:28
  • 'సైరా' తర్వాత మరో ప్రాజక్ట్ చేయని సురేందర్ రెడ్డి 
  • అల్లు అర్జున్ కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ పని 
  • వచ్చే ఏడాది సెట్స్ కి వెళ్లేలా ప్లానింగ్ 
  • ప్రస్తుతం సుకుమార్ తో 'పుష్ప' చేస్తున్న బన్నీ    
Surendar Reddy to direct Allu Arjun

చిరంజీవి వంటి మెగాస్టార్ తో 'సైరా' వంటి భారీ చిత్రాన్ని చేసినప్పటికీ దర్శకుడు సురేందర్ రెడ్డికి ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ప్రభాస్ తో సినిమా చేయనున్నాడంటూ ఆమధ్య ప్రచారం జరిగినప్పటికీ వాటిలో వాస్తవం లేదని ఆ తర్వాత తేలిపోయింది. అయితే, ఇంతవరకు ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన రాలేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో తన తదుపరి చిత్రాన్ని ఆయన చేసే అవకాశం వుందని తాజాగా వార్తలొస్తున్నాయి.

బన్నీ ఇమేజ్ కి, స్టయిల్ కి తగ్గట్టుగా ఓ చక్కని కథను ప్రస్తుతం సురేందర్ రెడ్డి తయారుచేస్తున్నాడట. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారనీ, వచ్చే ఏడాది ఇది సెట్స్ కి వెళుతుందనీ అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రేసుగుర్రం' చిత్రం సూపర్ హిట్టయింది. దాంతో వీరి కాంబోకి మంచి క్రేజ్ వుంది. ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చిత్రాన్ని చేస్తున్నాడు. దీని షూటింగ్ ఎప్పటి నుంచి కంటిన్యూ అయ్యేది ఇంకా ఖరారు కాలేదు.