Mahesh Bhatt: బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్ ను విచారించిన ముంబై పోలీసులు

Mumbai police investigates producer Mahesh Bhatt
  • సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ
  • ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన పోలీసులు
  • కంగనా రనౌత్ ను విచారించనున్న పోలీసులు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ప్రముఖ నిర్మాత మహేశ్ భట్ ను ముంబై పోలీసులు ప్రశ్నించారు. ఈ మధ్యాహ్నం 11.30 గంటలకు శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ కు మహేశ్ భట్ వెళ్లారు. డీసీపీ అభిషేక్ త్రిముఖి సమక్షంలో ఆయన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి సినీ నటి కంగనా రనౌత్, నిర్మాత కరణ్ జొహార్ మేనేజర్ ను కూడా విచారణకు హాజరు కావాలని పోలీసులు కోరినట్టు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. అవసరమైతే కరణ్ జొహార్ ను విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పారు. బాలీవుడ్ లో నెలకొన్న బంధుప్రీతే సుశాంత్ మరణానికి కారణమని కంగనా రనౌత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

జూన్ 14న సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత బాలీవుడ్ లో నెలకొన్న నెపోటిజంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులను పోలీసులు విచారిస్తున్నారు.
Mahesh Bhatt
Bollywood
Kangana Ranaut

More Telugu News