గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి మార్చురీలో కెపాసిటీకి మించిన శవాలు

27-07-2020 Mon 13:09
  • జీజీహెచ్ మార్చురీ కెపాసిటీ 30 డెడ్ బాడీలు
  • ఇప్పటికే మార్చురీలో 50 శవాలు
  • శవాలకు కరోనా పరీక్షలు నిర్వహించాలనే నిబంధన
Guntur GGH hospital mortuary is filled with dead bodies

గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలోని మార్చురీ శవాలతో కిక్కిరిసిపోయింది. ఆసుపత్రిలోని మార్చురీ కెపాసిటీ 30 డెడ్ బాడీలు మాత్రమే. ప్రస్తుతం 50 శవాలు మార్చురీలో ఉన్నాయి. ఆసుపత్రిలో చనిపోయిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలనే నిబంధన ఉండటంతో... వాటికి టెస్టులు చేస్తున్నారు. అయితే టెస్టు రిపోర్టులు రావడంలో జరుగుతున్న జాప్యం కారణంగా శవాలు ఎక్కువైపోతున్నాయి. ఫలితాలు రాకుండా శవాలను అప్పగించేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఆసుపత్రిలో ఏ వ్యాధి కారణంగా మనిషి చనిపోయినా... డెడ్ బాడీకి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.