నేను చేసిన కేక్ మా ఆవిడకు బాగా నచ్చింది!: విరాట్ కోహ్లీ
- ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ చాట్ షోలో మాట్లాడిన కోహ్లీ
- అనుష్క కోసం జీవితంలో తొలిసారి కేక్ తయారు చేశాను
- అనుష్క పుట్టిన రోజు సందర్భంగా చేశా
తాను కేక్ తయారు చేయడం తొలిసారే అయినప్పటికీ బాగా రుచిగా తయారయిందని, ఆ కేక్ అనుష్కకు నచ్చిందని కోహ్లీ చెప్పాడు. తనకు కేక్ నచ్చిందని ఆమె ఆ సమయంలో చెప్పిన ఆ మాటలు తనకెంతో ప్రత్యేకమని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా, కరోనా నేపథ్యంలో క్రికెట్ బంద్ కావడంతో క్రికెటర్లు ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు.