Chandrababu: సోనూ సూద్ తో మాట్లాడాను... ఆ ఇద్దరు అమ్మాయిలను నేను చదివిస్తాను: చంద్రబాబు

Chandrababu responds on Chittoor district farmer issue
  • చిత్తూరు జిల్లా రైతుకు ట్రాక్టర్ అందించిన సోనూ సూద్
  • సోనూ సూద్ ను అభినందించిన చంద్రబాబు
  • ఆ  రైతు కుమార్తెల కలలను సాకారం చేస్తానని హామీ
ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న తండ్రికి చేదోడువాదోడుగా ఉండడం కోసం ఎంతో శ్రమకోర్చి పొలంలో కాడెత్తుకుని అరక దున్నిన ఇద్దరు అమ్మాయిల ఉదంతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన పట్ల స్పందించిన ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇప్పటికే ఆ రైతు కుటుంబానికో కొత్త ట్రాక్టర్ ను బహూకరించారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.

చిత్తూరు జిల్లా రైతు నాగేశ్వరరావు కుటుంబం పట్ల సోనూ సూద్ ఎంతో ఆపేక్ష ప్రదర్శించి ట్రాక్టర్ ను అందించడం పట్ల అభినందించానని తెలిపారు. సోనూ సూద్ తో మాట్లాడానని చంద్రబాబు వెల్లడించారు. ఆ కుటుంబ పరిస్థితి తనను కదిలించి వేసిందని, రైతు నాగేశ్వరరావు ఇద్దరు కుమార్తెల చదువుల బాధ్యతలను తాను స్వీకరిస్తానని హామీ ఇచ్చారు. వారి కలల సాకారానికి తనవంతు తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై సోనూ సూద్ వెంటనే ట్విట్టర్ లో స్పందించారు.. థ్యాంక్యూ సర్ అంటూ వినయంగా బదులిచ్చారు. మీ దయాగుణం ఎవరికైనా స్ఫూర్తి కలిగిస్తుంది, ముందుకొచ్చి సాయపడేలా ప్రేరణ కలిగిస్తుంది అని అన్నారు. "మీ మార్గదర్శకత్వంలో లక్షలమంది తమ కలల సాకారం దిశగా పయనిస్తున్నారు. మీరు ఇలాగే ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటున్నాను. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను సర్" అంటూ సోనూ వ్యాఖ్యానించారు.

Chandrababu
Soni Sood
Farmer
Tractor
Chittoor District

More Telugu News