Suma: మీరు ప్రేమించండి, లేకపోతే ద్వేషించండి... నేను మాత్రం 'స్టార్ మహిళ'తో మళ్లీ వస్తున్నా: సుమ

Suma announces Star Mahila is back
  • గతంలో రికార్డులు నెలకొల్పిన స్టార్ మహిళ
  • రెండేళ్ల కిందట చివరి ఎపిసోడ్
  • మళ్లీ ప్రసారం చేసేందుకు సుమ సన్నాహాలు
యాంకర్ సుమ నిర్వహించే 'స్టార్ మహిళ' కార్యక్రమం మళ్లీ వచ్చేస్తోంది. గతంలో రికార్డు స్థాయిలో 12 ఏళ్ల పాటు ప్రసారమైన 'స్టార్ మహిళ' రెండేళ్ల కిందట చివరి ఎపిసోడ్ ప్రసారమైంది. తెలుగునాట ఎంతో ప్రజాదరణ పొందిన ఆ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు సుమ అప్పట్లో వెల్లడించింది. అయితే, తాజాగా సుమ ట్విట్టర్ ద్వారా సంతోషకరమైన వార్త వెల్లడించింది. 'స్టార్ మహిళ' మళ్లీ వస్తోందంటూ ప్రకటించింది.

"కొన్ని సమయాల్లో కొన్ని అంశాలతో మనం ఎంతో భావోద్వేగాలతో ముడిపడిపోతాం. ఆ అంశం కూడా మనలో ఓ భాగమైపోతుంది. ప్రస్తుతం ఎంతో అనిశ్చితి నెలకొన్న సమయంలో మీ అందరికీ వినోదం, ఆనందం మళ్లీ అందించాలనుకుంటున్నాం. ప్రేమించండి లేకపోతే ద్వేషించండి... కానీ దీన్నుంచి మాత్రం తప్పించుకోలేరు. 'స్టార్ మహిళ' ఈజ్ బ్యాక్" అంటూ సుమ ట్వీట్ చేశారు.

Suma
Star Mahila
Programe
Television
Andhra Pradesh
Telangana

More Telugu News