Pragya Thakur: రోజుకు ఐదుసార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే కరోనా పోతుందంటున్న బీజేపీ మహిళా ఎంపీ

Pragya Thakur says read hanuman chalisadaily five time to prevent corona
  • జూలై 25 నుంచి ఆగస్టు 5 వరకు పారాయణం చేయాలన్న ప్రగ్యా
  • చివరి రోజున రాముడికి హారతి పట్టాలని సూచన
  • ఆ తర్వాత కరోనా ఉండదని వివరణ
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బీజేపీ మహిళా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కరోనా నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజుకు ఐదుసార్లు భక్తితో హనుమాన్ చాలీసా పఠిస్తే కరోనా పోతుందని సెలవిచ్చారు. జూలై 25 నుంచి ఆగస్టు 5 వరకు ఈ విధంగా ప్రతిరోజూ ఆంజనేయ దండకం చదివితే కరోనా అంతమైపోతుందని తెలిపారు. చివరి రోజున ఇంట్లో దీపాలు వెలిగించి శ్రీరాముడికి హారతిపట్టాలని సూచించారు. ఆగస్టు 5 తర్వాత కరోనా ఇక ఉండదని అమె చెబుతున్నారు. అదే రోజున అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కూడా జరగబోతోందని, ఆ రోజున అందరం దీపావళి జరుపుకుందామని తెలిపారు.
Pragya Thakur
Corona Virus
Hanuman Chalisa
BJP

More Telugu News