Uttam Kumar Reddy: దళితులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుంటే నన్ను నిర్బంధించారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • మల్లారంలో దళితుడిని కొట్టి చంపారన్న ఉత్తమ్
  • తమను అరెస్ట్ చేశారని వెల్లడి
  • దళితులు, గిరిజనుల హక్కుల కోసం పోరాడతామని ఉద్ఘాటన
Uttam Kumar reddy says that he was detained

కేసీఆర్ పాలనలో దళితులు, గిరిజనులపై దాడులు, హత్యలు జరగుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రధాన కారణం దళితులు, గిరిజనులేనని అన్నారు. దళితులు, గిరిజనుల ఓట్లతో గెలిచిన కేసీఆర్ ఇప్పుడు వాళ్లనే అణగదొక్కాలని చూస్తున్నాడంటూ మండిపడ్డారు.

గతంలో మంథని నియోజకవర్గంలో లాకప్ డెత్ జరిగిందని వెల్లడించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు మల్లారంలో రాజబాబు అనే దళితుడిని కొట్టి చంపారని ఆరోపించారు. దళితులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుంటే తనతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి నిర్బంధించారని తెలిపారు. తాము దళితులు, గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

More Telugu News