Bonthu Rammohan: హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా పాజిటివ్

Hyderabad city mayor Bonthu Rammohan tested corona positive
  • కరోనా బారినపడిన హైదరాబాద్ మేయర్
  • గతంలో రెండుసార్లు ఆయనకు నెగెటివ్
  • మూడో పరీక్షలో పాజిటివ్
  • మేయర్ కుటుంబ సభ్యులకు కరోనా నెగెటివ్
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారి బీభత్సం ఎలావుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ఆయన హోం క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు.

కాగా, బొంతు రామ్మోహన్ కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని వచ్చింది. మేయర్ రామ్మోహన్ గతంలో రెండుసార్లు కరోనా టెస్టులు చేయించుకున్నారు. అప్పుడు నెగెటివ్ రాగా, ఈసారి మాత్రం పాజిటివ్ అని తేలింది.
Bonthu Rammohan
Corona Virus
Positive
Mayor
Hyderabad

More Telugu News