Kesineni Nani: ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడు బెడ్ దొరక్క నిన్నంతా అంబులెన్స్ లోనే ఉండి చనిపోయాడు: కేశినేని నాని

Kesineni Nani questions CM Jagan and YSRCP over corona situations
  • తాజా పరిస్థితులపై కేశినేని నాని ఆందోళన
  • సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్
  • సామాన్యుడి పరిస్థితి భయానకం అంటూ వ్యాఖ్యలు
టీడీపీ ఎంపీ కేశినేని కరోనా పరిస్థితులు ఇలా ఉన్నాయంటూ ఆవేదనతో కూడిన ట్వీట్ చేశారు. విజయవాడలో ఒక మాజీ ఎమ్మెల్యే సోదరుడు కరోనా బారినపడ్డాడని, అయితే ఆసుపత్రిలో బెడ్ దొరక్క నిన్న అంతా రోడ్డు మీద అంబులెన్స్ లోనే ఉండి ఇవాళ తెల్లవారుజామున మరణించాడని కేశినేని నాని వెల్లడించారు. వీళ్ల పరిస్థితే ఇలావుంటే వైసీపీ పాలనలో సామాన్యుడి పరిస్థితి ఊహించుకుంటే భయమేస్తోంది జగన్ రెడ్డి గారూ! అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
Kesineni Nani
Jagan
YSRCP
Corona Virus
Andhra Pradesh

More Telugu News