ముఖ్యమంత్రిగా మీరెందుకు ఈ పని చేయలేక పోతున్నారో చెప్పండి జగన్ గారు: దేవినేని ఉమ
- నిన్న 7,813 కరోనా కేసులు, 52 మరణాలు
- 10 సెకండ్లకొక కేసు నమోదు
- చంద్రబాబు జీఎఫ్‌ఎస్‌డీ ద్వారా నిపుణులతో మాట్లాడారు
- వారిలో మనో ధైర్యం నింపారు
ఈ సందర్భంగా నిన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెబినార్‌లో ప్రముఖ వైద్యులతో మాట్లాడిన విషయానికి సంబంధించిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు. కరోనా రోగులకు తాము అందించిన చికిత్సలో గుర్తించిన విషయాలను చంద్రబాబుతో వైద్యులు పంచుకున్నారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ కరోనా లక్షణాలు ఉన్న వారు 72 గంటలపాటు ఇంట్లోనే ఉండటం మంచిదని వైద్యులు సూచించినట్లు అందులో పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఇంకా పెరిగే అవకాశం ఉందా? అన్న విషయం తెలియడానికి ఈ వ్యవధి అవసరమని వైద్యులు తెలిపారు.